తెలంగాణ

దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

*రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి: జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్*

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్భువనగిరి అక్టోబర్ 15: ఆటో మొబైల్ దొంగతనాలు, ఇళ్లలో చోరీలు, స్నాచింగ్‌లు, ఇతర దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ గురువారం భువనగిరి డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి, వారి కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.సమావేశంలో భువనగిరి డీఎస్పీ రవీందర్, సీఐ చంద్రబాబు, సిసి ఎస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు,ఎస్‌ఐలు అనిల్, శ్రీశైలం, ఐటీ సెల్ ఇన్‌చార్జ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS