*కార్మిక హక్కుల సంక్షేమం కోసం ఉద్యమించింది ఏఐటియుసి*
*కార్మిక హక్కుల సంక్షేమం కోసం కార్మికులు ఉద్యమించాలి*
*అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 31 వలిగొండ*107 వ ,ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం వలిగొండ మండల కేంద్రంలో ఆటో, హమాలి యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జెండా ఎగరవేసిన మండల అధ్యక్షులు కనకబోయిన ఆంజనేయులుఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంకి మహేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 1920 అక్టోబర్31 వ తేదీన ముంబయి నగరం లో లాలాలాజపతిరై , డాంగ్ అద్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు కార్మిక హక్కుల కోసం,వారి సంక్షేమం కోసం నిత్య పోరాటాలు కొనసా గిస్తూ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం, ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, గ్రాడ్యుటి, మెడికల్ లీవ్ ల, బ్యాంకింగ్ ఎల్ఐసి, రైల్వే ,ఆర్టీసీ, బి టి పి ఎస్ హెవీ వాటర్ ప్లాంట్,సింగరేణి, ఎన్ టి పి సి,ప్రైవేట్ కర్మాగారాల్లో కార్మికుల సంక్షేమ కోసం అనేక పోరాటాలు నిర్వహించి వారి హక్కులు కోసం నిరంతరం పోరాడిన సంఘం ఏఐటీయూసీ సంఘం అని అన్నారు. 107 సంవత్సరాల చరిత్రలో ఎన్నో పోరాటాల ద్వారా ఎన్నో హక్కులు కార్మికులు సాధించుకున్నారని వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక సంఘాల పై ఉందని అన్నారు.సిపిఐ మండల కార్యదర్శి సలిగంజి వీరస్వామి హాజరై మాట్లాడుతూ*….. కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న అనేక హక్కులను నేడు కేంద్రo లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ. 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా గా విభజించి ,కార్మిక హక్కులను కాల రాయాలని చూస్తుందని ,దీనికోసం ఏఐటీయూసీ కార్మిక సంఘాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైన దన్నారు. ఈ ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేస్తే ,కార్మికుల హక్కులు కాల రాయబడతాయని, స్వతంత్ర పని విధానం ఉండదని, కనీసం 200 మంది లేనిదే యూనియన్ కూడా పెట్టుకోకూడదని నిబంధనలు అమలులో తీసుకొస్తున్నారని, చట్ట విరుద్ధమైన ఈ లేబర్ కోడ్ లు రద్దు చేసేంతవరకు కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించి పోరాడాలని , ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించాలని దీనికోసం కార్మికులు సన్నద్ధం కావాలనిఅన్నారు.*ఈ కార్యక్రమంలో ఏఐటియూసి గౌరవ అధ్యక్షులు సల్వాద్రి రవీందర్,ఏఐటియూసి మండల నాయకులు చొప్పరి వెంకటేశం,ఆదిమూలం రమేష్, నానాచర్ల వెంకటేష్, ఆదిమూలం శ్రీకాంత్, జక్కుల వెంకటయ్య, ఇంజమూరి సాయిలు,తాల్క యాదయ్య, యాట నరసింహ, శ్యామల నరేష్, చంద్రమౌళి,కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.