అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 3 వలిగొండ భువనగిరి ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సైబర్ నేరాల నివారణ, సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, నకిలీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.ఎవరితోనూ ఓటిపి బ్యాంక్ ఖాతా వివరాలు, యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగరాజు, అశోక్, వెంకటేష్ పాల్గొన్నారు.