అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ నవంబర్ 3 వలిగొండ పోలీస్ అంటేనే భయం అనే రోజులు పోయాయి. పోలీస్ అంటే భరోసా, భద్రత అనే భావనను ప్రజల్లో నింపుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న వలిగొండ పట్టణ యువ అధికారి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పేరు ప్రస్తుతం జిల్లా స్థాయిలో చర్చనీయాంశంగా మారారు.అధికారంతో పాటు ఆప్యాయతబాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే శ్రీకాంత్ రెడ్డి తన పని తీరుతో ప్రజలకు చేరువయ్యారు. స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని సమస్య తన సొంత సమస్యగా భావించి, వెంటనే స్పందించడం, న్యాయం జరిగేలా చూడడం ఆయన ప్రత్యేకత. “సార్ లేరు, రేపు రండి” అనే మాటలకు తావు లేకుండా, 24 గంటలు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిదర్శనంగా నిలుస్తున్నారు.నేర నియంత్రణలో ఉక్కు పాదం మోపుతూగత కొన్ని నెలలుగా ప్రాంతంలో పెరిగిన చిన్న చిన్న దొంగతనాలు, రాత్రి వేళల్లో అల్లర్లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వాటిపై ఆయన ఉక్కు పాదం మోపారు. నిరంతరం పెట్రోలింగ్, అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచడం, రౌడీషీటర్లను కట్టడి చేయడంతో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.యువతే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు ఆయన ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, “మత్తు వద్దు – భవిష్యత్తు ముద్దు” అనే నినాదంతో యువతలో చైతన్యం నింపుతున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్ బెల్ట్ పై అవగాహన, మహిళల రక్షణకు షీ టీమ్స్ పర్యవేక్షణలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయం.ప్రజల మాటలోనే..*”కొత్త ఎస్సై వచ్చాక మా ఊర్లలో రాత్రి పూట కూడా ప్రశాంతంగా తిరగగలుగుతున్నాం.ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారు. ఇలాంటి అధికారి ఉండడం మా అదృష్టం” అని స్థానికులు పేర్కొన్నారు. వ్యాపారులు సైతం “అక్రమ వసూళ్లు లేకుండా, అందరితో గౌరవంగా మాట్లాడుతూ న్యాయం చేస్తున్నారు” అని కొనియాడుతున్నారు.నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరైన యువ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఇదే స్ఫూర్తితో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వలిగొండ మండల ప్రజలు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.