సినిమా వార్తలు

వెలువర్తి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

వెలువర్తి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 29 వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి జిల్లా పరిషత్ పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్అనురాగ్ జయంతి, డిఈఓ బిక్షపతి, సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదవ తరగతి ఆరవ తరగతి ఏడవ తరగతి విద్యార్థులతో చదివించడంతోపాటు సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు అడిగి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు చదవడం రాయడంలో నైపుణ్యత సాధించాల ని పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఇప్పటినుండే కృషి చేయాలని ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరి విద్యార్థుల మీద తగు శ్రద్ధ తీసుకొని బాగా చదివే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులు అన్ని రంగాలలో ముందు ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల ఆవరణ తరగతి గదులు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా నీటిని వృధా చేయకుండా విద్యార్థుల అవగాహన కల్పించాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుంకోజ్ భాస్కర్ ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి స్థానిక సర్పంచ్ ఉపాధ్యాయులు తహసిల్దార్ జి దశరథ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS