అక్షర ఆయుధం ప్రతినిధి మారగొని శ్రీనివాస్ గౌడ్*వలిగొండ అక్టోబర్ 15* మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో వెలువర్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడోత్సవాలను గ్రామంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో గురువారం ప్రారంభించారు. క్రీడా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరిక దారుఢ్యం ఏర్పడతాయ ని పోటీలలో గెలుపోటములు సహజమని ఓటమిలను విజయానికి మలుపుగా మలుచుకొని జీవితంలో ఎదగాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. అనంతరం క్రీడాకారులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనితనర్సింగ్ యాదవ్, యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కూచిమల్ల సుధాకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గిరిబాబు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఉక్కుర్తి స్వామి, ఎడవెల్లి మల్లేశం, మాజీ అధ్యక్షులు బైరు సైదులు, కలుకూరి మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్లు నాగిళ్ళ రాము, బూడిద రాజు, ఉపాధ్యక్షులు పరకాల దశరథ, మల్లం ఉపేందర్, చెవ్వ పవన్, సూరబోయిన దయాకర్, కోశాధికారి మల్లం సాయి, ప్రధాన కార్యదర్శులు బోదాసు రాజు, క్రీడ కార్యదర్శులు పరకాల కిషోర్, మల్లం చంద్రమౌళి, ఎడవెల్లి వెంకటేశం, తక్కల్ల సురేష్, కార్యదర్శులు బద్దుల ప్రశాంత్, సలహాదారు ఇంజమూరి శేఖర్, ఎడవల్లి విజయ్, పిట్టల నరేష్, నిమ్మల శేఖర్, కూచిమల్ల రాము, యూత్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.