క్రైమ్ వార్తలు

పాపం.. మూడో తరగతి బాలికపై టీచర్ దాష్టీకం.. ఏం జరిగిందో (వీడియో చూడండి)

పాపం.. మూడో తరగతి బాలికపై టీచర్ దాష్టీకం.. ఏం జరిగిందో (వీడియో చూడండి)

అక్షర ఆయుధం న్యూస్ :- ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో మూడో తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపాయి. సుల్తాన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న అనోఖి అనే చిన్నారి తనను టీచర్ పదేపదే కొడుతున్నాడని, ఇటీవల తన జుట్టును కూడా పీకేశాడని తల్లిదండ్రుల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.

చిన్నారి చెప్పిన విషయాలు తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని ఘటనపై సిబ్బందిని ప్రశ్నించారు. ఉపాధ్యాయుడు మనోజ్ తమ కుమార్తెపై దాడి చేయడంతో పాటు జుట్టు కోసేశాడని వారు ఆరోపించారు. ఈ విషయంపై పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించారని బాధిత కుటుంబం ఆరోపించింది.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. చిన్నారిపై దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను శాంతింపజేశారు.

ఈ ఘటనపై ఉపాధ్యాయుడు మనోజ్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. విద్యార్థులను భయపెట్టడం, శారీరకంగా హింసించడం వంటి చర్యలు పిల్లల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనపై పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS