తెలంగాణ

విద్యుత్ కోతలను నివారించాలని సబ్ స్టేషన్ ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

విద్యుత్ కోతలను నివారించాలని సబ్ స్టేషన్ ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 16 వలిగొండ భారతీయ జనతా పార్టీ మండల శాఖ, కిసాన్ మోర్చాల ఆధ్వర్యంలో మండలంలోని విద్యుత్ అధికారి కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు బో ళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24 గంటలకు విద్యుత్తును అందించాలని, అప్రకటిత విద్యుత్ కోతలను నివారించాలని, రైతుల పంట పొట్ట దశలో ఉన్న సమయంలో సమయపాలన లేకుండా విద్యుత్తు రావడం, పోవడం జరుగుతుందని ఈ విద్యుత్ కోతలను నివారించాలని సంబంధిత కార్యాలయ సిబ్బందికి మెమొరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బంధారపు లింగస్వామి, రాచకొండ కృష్ణ, అశోక్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మంద నరసింహ, రాములు, బచ్చు శ్రీనివాస్, మైసొల్ల పెద్దమచ్చగిరి, ఆనందు, పద్మా రెడ్డి, అనిల్, మండల పదాధికారులు రంజిత్ రెడ్డి, నాగరాజు, లోడే లింగస్వామి గౌడ్, దయాకర్, వెంకటేశం, యువ మోర్చా మండల అధ్యక్షుడు మైసొల్ల చిన్న మచ్చ గిరి, మండల నాయకులు, బూత్ అధ్యక్షులు జంగయ్య, మురళి, రాజేశ్వర చారి, జనార్దన్ రెడ్డి, భాస్కర్ గౌడ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS