*అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్* వలిగొండ సెప్టెంబర్ 28 డీసీసీ అధ్యక్షులు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య , భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై నెలకొన్న వివాదానికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.