వలిగొండ సెప్టెంబర్ 28 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ మండల కేంద్రంలో ఏఐటీయూసీ మండల సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119 వ జయంతినీ పురస్కరించుకొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐటియూసీ మండల అధ్యక్షులు కనకబోయిన ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది…. .ఏఐటియుసి మండల కార్యదర్శి ఎల్లంకి మహేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ* భగత్ సింగ్ ఈ దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని, బ్రిటిష్ సామ్రాజ్యానీ వ్యతిరేకంగా పోరాడారని అతి చిన్న వయసులో ఉరికంబాన్ని ముద్దాడి తన తోపాటు రాజు గురు ,సుఖుదేవ్ లు ప్రాణాలను ఇచ్చారని అన్నారు. వారి స్ఫూర్తితో నేటి సమాజమంతా చైతన్య మవ్వాలని ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలని అన్నారు కేంద్ర బిజెపి ప్రభుత్వం “సర్”స్పెషల్ ఇన్సెంటి రివిజన్ పేరుతోని దాదాపు 13 కోట్లా మంది ఓటర్లను తొలగించిందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంస్థను బ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు పోలపాక యాదయ్య, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు మారోజు నరసింహ చారి, ఏఐటియుసి సీనియర్ నాయకులు బోడిగ సుదర్శన్, మామిడికాయల నరేష్,ఇంజమూరి సాయిలు, ఎడవల్లి వేణు, శ్యామల నరేందర్,ఎక్కలదేవి విజయ్, యాట నరసింహా,సోమేశ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.