సినిమా వార్తలు

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ సెప్టెంబర్ 28యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారంనిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి నేరుగా వివరించారు. ప్రజలు అందించిన అర్జీలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం కలిగేలా వారి సమస్యలపై త్వరితగతిన స్పందించాలని తెలిపారు.ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ IPS తెలిపారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS