తెలంగాణ

జనతాదళ్ సెక్యులర్ పార్టీ 104వ వార్డు అభ్యర్థిగా చింతాడ రాజేష్ నామినేషన్ దాఖలు

జనతాదళ్ సెక్యులర్ పార్టీ 104వ వార్డు అభ్యర్థిగా చింతాడ రాజేష్ నామినేషన్ దాఖలు

జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పణ

అక్షర ఆయుధం న్యూస్: అక్టోబర్ 19 అనకాపల్లి జిల్లా (రిపోర్టర్ వెన్నెల శివకుమార్) జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనతాదళ్ సెక్యులర్ పార్టీ 104వ వార్డు అభ్యర్థి చింతాడ రాజేష్ తన నామినేషన్ పత్రాలను జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో డెక్కల మహేష్, కంపర రమేష్ పాల్గొన్నారు.చింతాడ రాజేష్‌కు మౌలిక సదుపాయాల రంగంలో 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా వ్యవస్థలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్ టి పి), నీటి శుద్ధి కేంద్రాలు (డబ్ల్యుటిపి), పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి వివిధ రంగాల్లో ఆయనకు విశేష పరిజ్ఞానం ఉంది.తన వృత్తిపరమైన అనుభవాన్ని ప్రజాసేవకు వినియోగిస్తూ, 104వ వార్డులో మెరుగైన రహదారులు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. వార్డులోని ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని చింతాడ రాజేష్ పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, వార్డు అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. జనతాదళ్ సెక్యులర్ పార్టీ తరఫున 104వ వార్డు అభ్యర్థిగా చింతాడ రాజేష్ నామినేషన్ దాఖలు చేయడం, ఈ కార్యక్రమంలో డెక్కల మహేష్, కంపర రమేష్ పాల్గొనడంతో స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS