అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 19వలిగొండ భువనగిరిలో నిర్వహించిన Zero Road Traffic Accidents (ZRTA) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి IAS, జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ IPS, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొని ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు.జిల్లాలోని ప్రధాన బ్లాక్ స్పాట్లుగా భువనగిరి ఎల్లమ్మ ఆలయం పక్కన ఉన్న క్రాస్ రోడ్, బీబీనగర్ క్రాస్ రోడ్, దీప్తి హోటల్ ఎదురుగా ఉన్న ప్రాంతంతో పాటు జాతీయ రహదారిపై మరికొన్ని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు.ప్రమాదాల నివారణకు అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, క్రాసింగ్ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి, సంబంధిత శాఖల సమన్వయంతో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రమాద మరణాలు లేని జిల్లాగా యాదాద్రి భువనగిరిని తీర్చిదిద్దడమే లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ సంగం, బీబీనగర్ ఎస్ఐ రమేష్, ఎస్ఐ అనిల్, NHAI అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.