తెలంగాణ

జనతాదళ్ సెక్యులర్ పార్టీ 106వ వార్డు అభ్యర్థిగా డాక్టర్ శనివాడ శ్రీను నామినేషన్ దాఖలు

జనతాదళ్ సెక్యులర్ పార్టీ 106వ వార్డు అభ్యర్థిగా డాక్టర్ శనివాడ శ్రీను నామినేషన్ దాఖలు

జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ

అక్షర ఆయుధం న్యూస్: అక్టోబర్ 19 అనకాపల్లి జిల్లా (రిపోర్టర్ వెన్నెల శివకుమార్) జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనతాదళ్ సెక్యులర్ పార్టీ తరఫున 106వ వార్డు అభ్యర్థిగా డాక్టర్ శనివాడ శ్రీను తన నామినేషన్ పత్రాలను జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జనతాదళ్ సెక్యులర్ పార్టీ నాయకులు శనివాడ చిన్నారావు, బొండా లీలాకృష్ణ పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థికి తమ మద్దతు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ శ నివాడ శ్రీను మాట్లాడుతూ, 106వ వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుధ్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు.వార్డులోని ప్రజల సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS