తెలంగాణ

ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ 157 జయంతి వేడుకలు

ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ 157 జయంతి వేడుకలు

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ, అక్టోబర్ 2 :* జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను తెలంగాణ ఉద్యమకారుల పోరం మండల అధ్యక్షుడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వలిగొండ మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, ఉపసర్పంచ్ మలుగ మాధవి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహదేవ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గాంధీ చూపిన అహింసా మార్గం, సత్యం, దేశభక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన బాటలో నడవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల పోరం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, జిల్లా గౌరవ సలహాదారులు బోడిగే సుదర్శన్, ఉద్యమకారుల ఫోరం నాయకులు బత్తిని రవీందర్ గౌడ్, చిలుగూరి సత్తిరెడ్డి, ఐటి పాముల పుష్ప, దండ మల్లికార్జున్, సుంకి వెంకటేశ్వర్లు, ధనంజయ, మారగోని నరసింహ, కూర వెంకటేష్ , కన్నె కంటి రామాచారి, అప్పిశెట్టి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS