తెలంగాణ

గాంధీ జయంతిని అవమానపరిచిన వలిగొండలోనిశ్రీ చైతన్య పాఠశాల

గాంధీ జయంతిని అవమానపరిచిన వలిగొండలోనిశ్రీ చైతన్య పాఠశాల

మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్షర అయుధం ప్రతినిధి వలిగొండ అక్టోబర్ 2భారత జాతి యావత్తు అక్టోబర్ రెండు గాంధీ జయంతిని అంబరాన్ని అంటి సంబరాలు నిర్వహిస్తుంటే వలిగొండ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థ గాంధీ జయంతిని అవమాన పరుస్తూ పాఠశాలను నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను విద్యా ప్రమాణాలను పాటించకుండా తనదైన శైలిలో ప్రిన్సిపల్ వ్యవహరించడం పలువురు విద్యార్థి తల్లిదండ్రులను ఆందోళన గురవుతున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి స్వతంత్ర సమరయోధుల త్యాగాలను నేర్పించాల్సిన విద్యాలయాలే వారి జయంతి మర్చిపోయి పాఠశాల నిర్వహిస్తుండడం శోచనీయం. ఈ విషయమై పాఠశాలకు మీడియా ప్రతినిధులు వెళ్ళగానే హుటాహుటిన విద్యార్థులను బయటికి పంపియడం గమనార్హం. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ విద్యాలయంలో చోటుచేసుకున్నాయి. విద్య శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు గుసగుసలాడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS