యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఫ్లాష్ వాక్, ప్రజా ప్రతిజ్ఞ
అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ యాదాద్రి అక్టోబర్ 1యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మంత్ – అక్టోబర్ సందర్భంగా భువనగిరి పట్టణంలో గురువారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ఫ్లాష్ వాక్ మరియు ప్రజా ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డి.ఎస్.పి రవీందర్ నాయకత్వం వహించగా, భువనగిరి టౌన్ సీఐ రమేష్, రూరల్ సీఐచంద్రబాబు , ఎస్సై అనిల్ లక్ష్మీనరసయ్యతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ & మీడియా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. OTP, PIN, CVV, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్లు, నకిలీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని తెలిపారు.అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు కలిసి సైబర్ నేరాల నివారణ, వ్యక్తిగత సమాచార భద్రత, డిజిటల్ సురక్షిత వినియోగంపై ప్రజా ప్రతిజ్ఞ చేశారు.“ఆలోచించి క్లిక్ చేయండి – ధృవీకరించి స్పందించండి – సురక్షితంగా ఉండండి” అనే సందేశంతో సైబర్ భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు.