తెలంగాణ

జాతీయ మాల మహానాడు 20 వసంతాల ఆవిర్భవ దినోత్సవం.

జాతీయ మాల మహానాడు 20 వసంతాల ఆవిర్భవ దినోత్సవం.

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ అక్టోబర్ 27 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ మాల మహానాడు 20 వసంతాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాల మానాడు జిల్లా అధ్యక్షులు పెరమండ్ల యాదగిరి ఆధ్వర్యంలో జాతీయ మాల మానాడు 20 వసంతాలు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల మహానాడు స్థాపించి నేటికి 20 వసంతాల పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా మాల మాలలు ఒకే ఏకతాటిపై ఉండాలని మనకు జరుగుతున్న అన్యాయంపై ఎదిరించి రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మాలల సత్తా ఏందో చూపియాలని తెలంగాణ మాలలకు జరుగుతున్న రోస్టర్ పాయింట్తో జరుగుతున్న అన్యాయం గురించి ప్రభుత్వానికి వివరంగా చెప్పి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షులు కూచమల్ల నాగేష్ మాల మహానాడు ఉపాధ్యక్షులు బుంగ శేఖర్ మాల మహానాడు సీనియర్ నాయకులు భూతం మల్లేశం రిటైర్డ్ ఎంప్లాయ్ రాపోలు పవన్ కుమార్ నీలం నరేందర్ దాసిరెడ్డిగూడెం సర్పంచ్ రాపోలు గోపి మాల మహానాడు మండల నాయకులు కట్ట దానయ్య గూడపురి రాజు కేతం ఇంద్ర రాజ్ తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS