తెలంగాణ

అంజయ్య మృతి తీరని లోటు – యానాల దామోదర్ రెడ్డి

అంజయ్య మృతి తీరని లోటు – యానాల దామోదర్ రెడ్డి

అక్షర ఆయుధం ప్రతినిధి వలిగొండఅక్టోబర్ 24* మండల పరిధిలోని వేములకొండ గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ అంజయ్య అకాల మరణం చెందారు. ఆయన పార్దేవ దేహం పై ఎర్రజెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించి కామ్రేడ్ అంజయ్య పేద కుటుంబంలో పుట్టినప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ -సిపిఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై పులి పలుపుల రామ లక్ష్మయ్య, ఖాజా మైనుద్దీన్, నీలం చెన్నయ్య గారాలతో కలసి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. పదవుల కోసం ఆశపడకుండా పేద ప్రజల సమస్యల పరిష్కారమే ద్వేయంగా పని చేసినారు అతని మృతి కుటుంబానికి భారత కమ్యూనిస్టు పార్టీకి ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటని అతని మృతి పట్ల జిల్లా కమ్యూనిస్టు పార్టీ తరఫున జోహార్లు అర్పించి కుటుంబానికి సానుభూతి తెలియజేయడమైనది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్, శాఖ కార్యదర్శి పులిపలుపుల మల్లేశం,అంబటి అంజయ్య, తాలూకా యాదయ్య, గుండె గాని అంజయ్య, ఏఐవైఎఫ్ మండల సహాయ కార్యదర్శి గుండె గాని నాగరాజు, పైల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS