తెలంగాణ

మాజీ ఎంపీటీసీ గూడూరు లక్ష్మమ్మకు ఘన నివాళిచేసిన సేవలు మరువలేనివి ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి

మాజీ ఎంపీటీసీ గూడూరు లక్ష్మమ్మకు ఘన నివాళిచేసిన సేవలు మరువలేనివి ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ, అక్టోబర్ 19: వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు–ఎదుళ్ళగూడెం ఎంపీటీసీగా పనిచేసిన మహిళా సంఘం నాయకురాలు గూడూరు లక్ష్మమ్మ గ్రామాభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి అన్నారు. ఎదుళ్ళగూడెం గ్రామంలో జరిగిన గూడూరు లక్ష్మమ్మ అంత్యక్రియల్లో పాల్గొని ఆమెకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీగా పనిచేసిన కాలంలో పొద్దుటూరు, ఎదుళ్ళగూడెం గ్రామాల అభివృద్ధి కోసం మండల స్థాయిలో నిరంతరం పోరాడి అనేక అభివృద్ధి పనుల సాధనకు కృషి చేశారని కొనియాడారు.ముఖ్యంగా పేద ప్రజల సమస్యల పరిష్కారానికి, మహిళల హక్కుల కోసం, మహిళా సంఘాల బలోపేతానికి ఆమె చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకురాలిగా లక్ష్మమ్మ గుర్తింపు పొందారని తెలిపారు.ఆమె భర్త గూడూరు సత్తిరెడ్డితో కలిసి గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అనేక సేవలు అందించారని గుర్తుచేశారు. లక్ష్మమ్మ మరణం కుటుంబ సభ్యులకే కాకుండా గ్రామ ప్రజలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు.లక్ష్మమ్మకి కుమారుడు ప్రవీణ్ రెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ అంత్యక్రియల కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి తుర్కపల్లి సురేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, గూడూరు శివశాంత్ రెడ్డి, పడమటి దామోదర్ రెడ్డి,రైతు సంఘం జిల్లా నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి, మామిడి పద్మారెడ్డి, భీమిడి ఇంద్రారెడ్డి, పైల్ల వెంకటరమణారెడ్డి, పళ్ల సత్తిరెడ్డి తదితరులు పాల్గొని గూడూరు లక్ష్మమ్మకి ఘన నివాళులర్పించారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS