అక్షర అయుధం ప్రతినిధి వలిగొండ సెప్టెంబర్ మారగోని శ్రీనివాస్ గౌడ్ 29 భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో చేపట్టారు. బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పదులది రాంచందర్ ఆధ్వర్యంలో మంగళవారం వలిగొండ మండలం టేకులసోమారం గ్రామంలోని “సాధన మానసిక వికలాంగుల కేంద్రం (ఆశ్రమం)” లో ఉన్న వ్యక్తులకు ప్రత్యేక ఆనందాన్ని పంచుతూ అన్నదాన (ఆహార వితరణ) కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ కేవలం రాజకీయం మాత్రమే కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్న వారికి, ముఖ్యంగా మానసిక వికలాంగులు మరియు ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వారికి చేతనైన సాయం అందించి వారి ముఖాల్లో ఆనందాన్ని చూడటమే ప్రధాని మోదీ స్ఫూర్తితో చేపట్టిన ఈ సేవా సంకల్ప అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాలసీ సెల్ కన్వీనర్ సర్వీ శ్రీనివాస్, జిల్లా ఉపధ్యక్షుడు పట్నం శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, వలిగొండ మండల అధ్యక్షులు, బోళ్ల సుదర్శన్,పట్టణ అధ్యక్షులు బలరాం, జిల్లా కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహ రావు,st మోర్చా అధ్యక్షులు వెంకటేష్, జిల్లా నాయకులు మహేష్ గౌడ్, బెల్లంకొండ కిరణ్, రాములు, రాజు యాదవ్, శ్రీకాంత్, మంద నర్సింహా, మందుల నాగరాజు, రంజిత్ రెడ్డి, వరురో శంకర్, గ్రామస్థులు పాల్గొన్నారు.