తెలంగాణ

వలిగొండలో డీజిల్ దొంగ అరెస్ట్ – రూ.1.70 లక్షల నగదు, మొబైల్ స్వాధీనం

వలిగొండలో డీజిల్ దొంగ అరెస్ట్ – రూ.1.70 లక్షల నగదు, మొబైల్ స్వాధీనం

సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రవి

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ అక్టోబర్ 9 వలిగొండలో వరుస డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాలలోని ఒకరిని వలిగొండ సబ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. రవి విలేకరుల సమావేశంలో కేసు వెల్లడించారు. గత నెల 21 29 తేదీలలో లారీల నుండి వరుస డీజిల్ దొంగతనాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున అనుమానస్పదంగా కారులో ప్రయాణిస్తున్న నేరస్తుడు సయ్యద్ సోహెల్ అలియాస్ పప్పు సోహెల్ నుఅదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు.అతని దగ్గరి నుండి రూ.1 లక్షా 70 వేల నగదు, వివోమొబైల్ ఫోన్,బెలనో కారు, ఇనుపరాడ్లు మరియు స్క్రూడ్రైవర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.బేలేనో కారులో వచ్చి ఇనుపరాడ్ సహాయంతో ట్యాంక్ కు రంధ్రం చేసి డీజిల్ చోరీ చేసేవారు. ఇతనితో పాటు ఐదుగురితో టీంగా ఏర్పడి, స్కూల్ డ్రైవర్ల సహాయంతో రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.వలిగొండలో నేరాలకు తావులేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. నిందితున్ని పట్టుకున్న ఎస్సై శ్రీకాంత్ రెడ్డిని, క్రైమ్ టీం పోలీసులు నిరంజన్, సురేష్ సతీష్ లను సిఐ అభినందించారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS