తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 15 స్మార్ట్ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఎంతో భరోసా లభించిందని స్థానిక శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం వలిగొండ పట్టణ కేంద్రంలోని దేవి శ్రీ గార్డెన్స్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, వలిగొండ మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం ద్వారా ఆహార భద్రతకు భరోసా కల్పించడంతో పాటు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు మరింత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుల ద్వారా అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.అదేవిధంగా, సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ద్వారా వారి సొంతింటి కల సాకారమయ్యేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా పనోచేయడమే మా ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జి. దశరథ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జలంధర్ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహదేవ్ గౌడ్,pacs చైర్మన్ గరిసే రవి, స్థానిక సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, పట్టణ, అధ్యక్షులు పోలే పాక జానకి రాములు, సర్పంచ్ లు ఫోరం మండల అధ్యక్షుడు రేసు బుచ్చిరెడ్డి,నాయకులు,, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS