సినిమా వార్తలు

భారతీయ జనతా పార్టీ యువమోర్చా నూతన మండల అధ్యక్షునిగా మైసొల్ల చిన్న మచ్చ గిరి

భారతీయ జనతా పార్టీ యువమోర్చా నూతన మండల అధ్యక్షునిగా మైసొల్ల చిన్న మచ్చ గిరి

అక్షర ఆయుధం ప్రతినిధి వలిగొండ సెప్టెంబర్ 30మారగోని శ్రీనివాస్ గౌడ్ భారతీయ జనతా పార్టీ మండల యువ మోర్చా అధ్యక్షునిగా వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మైసొల్ల చిన్న మచ్చ గిరి ఎన్నికయ్యారు. అలాగే యువ మోర్చా జిల్లాఉపాధ్యక్షులుగా బుంగ మట్ల మహేష్ ను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్,జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు దయ్యాల కుమార్ తో పాటు మండలానికి చెందిన రాష్ట్ర , జిల్లా, మండల పదాధికారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని. రానున్న రోజుల్లో భారతీయ జనతా యువమోర్చా విద్యార్థుల సమస్యల పట్ల, ఈ ప్రభుత్వం అనేక రకాల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ప్రజలను మోసం చేసిందని , ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా యువమోర్చా జిల్లా, మండల కమిటీలు నిరంతరం శ్రమిస్తాయని వారు పత్రిక ప్రకటనలో తెలియజేశారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS