అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ సెప్టెంబర్ 26 తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని ఆమె విగ్రహానికి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నిజాం సర్కార్ కు, దొరలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ చరిత్రలో ఆమె పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని, నేటి యువత ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం గౌరవ సలహాదారులు బోడిగే సుదర్శన్, కళాకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మల్ల వెంకటేశం గౌడ్, సీనియర్ పాత్రికేయుడు రెబ్బ కుమారస్వామి,కొండూరు సత్తయ్య, ఎదురు గట్ల పెద్ద యాదగిరి, యాదగిరి, సందయ్య, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.