సినిమా వార్తలు

దివ్యాంగులకు ఇచ్చిన హమీలు అమలు చేయకపోతేప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం*

దివ్యాంగులకు ఇచ్చిన హమీలు అమలు చేయకపోతేప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం*

జాజుల శ్రీనివాస్ గౌడ్

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబరు 28 హైదరాబాద్*దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మలక్ పేటలో దివ్యాంగుల సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయం ఎదుట సోషల్ జస్టిస్ పార్టీ దివ్యాంగ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపిన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు దివ్యాంగులు ఆందోళన కొన సాగించాలని, అందుకు తన మద్దతు ఉంటుందన్నారు. దివ్యాంగులకు చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించాలని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి అందజేశారు. ధర్నాలో సోషల్ జస్టిస్ పార్టీ దివ్యాంగ విభాగం అధ్యక్షుడు ఎంఎస్ యాదవ్, అధికార ప్రతినిధి సీహెచ్ వేణుగౌడ్, కార్యదర్శి ధనలక్ష్మి, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూరి రాజు తదిత రులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS