అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ అక్టోబర్ 17:తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ సందర్భంగా మండల ప్రజలకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆడపడుచులు ఆనందంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని కోరారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు.పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు.