తెలంగాణ

డ్వాక్రా రుణాలపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం

డ్వాక్రా రుణాలపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం

అక్షర ఆయుధం అక్టోబర్:6 రిపోర్టర్( బుయ్యన శ్రీను) ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో వెలుగు శాఖపై అక్టోబర్ 5, 6 తేదీల్లో ఓ దినపత్రికలో “వెలుగు శాఖలో ఏం జరుగుతుంది?”, “మైక్రో ఫైనాన్స్ ఉచ్చు” అనే శీర్షికలతో ప్రచురితమైన వార్తలపై సంబంధిత సిబ్బంది వివరణ ఇచ్చారు. ప్రచురితమైన వార్తల్లోని డ్వాక్రా రుణాలకు సంబంధించిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు.వింజరం గ్రామంలోని వెన్నెల, భార్గవి, సాయి సుధా డ్వాక్రా సంఘాలు 2021 సంవత్సరం నుంచి రుణాల రికవరీని సక్రమంగా చెల్లించడం లేదని, ఈ విషయంపై సంబంధిత వీవోఏను పలుమార్లు హెచ్చరించినప్పటికీ రికవరీలో జాప్యం జరుగు తోందని పేర్కొన్నారు.గత జూలైలో ఇంజరం గ్రామంలోని శ్రీ సాయిబాబా గ్రూపులకు ఆన్‌లైన్ MCP లేకుండానే బ్యాంకు ద్వారా రూ.14 లక్షల రుణం మంజూరైన విషయంపై సంబంధిత సీసీ, ఏపీఎంను వివరణ కోరగా, గ్రూపు సభ్యులే నేరుగా బ్యాంకు నుంచి రుణం పొందినట్లు తెలిపారని వివరించారు. ఆన్‌లైన్ MCP లేకుండా రుణం పొందడం వల్ల భవిష్యత్తులో SHGలకు వర్తించే ప్రభుత్వ పథకాలకు అనర్హత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పినందుకే తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని సంబంధిత సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.మర్రిపాడు గ్రామంలో ఐదు డ్వాక్రా సంఘాలకు కలిపి రూ.16.50 లక్షల రుణాలు ఇప్పించినట్లు తెలిపారు. ధనలక్ష్మి గ్రూపులో ఇద్దరు సభ్యులు తొలుత రుణం అవసరం లేదని చెప్పగా, వారితో మాట్లాడి స్త్రీనిధి రుణాల ఉపయోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించడంతో ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున రుణం తీసుకున్నారని, ప్రస్తుతం వారు సక్రమంగా వాయిదాలు చెల్లిస్తున్నారని వివరించారు. మైక్రో ఫైనాన్స్ రుణాలపై అవగాహన మండలంలోని ఏ గ్రామంలోనైనా డ్వాక్రా సంఘ సభ్యులు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు తీసుకున్న విషయం తన దృష్టికి రాలేదని ప్రాజెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ భానుమతి తెలిపారు అయితే వింజర గ్రామంలో రెండు రోజుల్లో డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి మైక్రో ఫైనాన్స్ రుణాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలు ఇబ్బందు వల్ల అవగాహన కల్పించేటట్లు చర్యలు తీసుకుంటామని ప్రాజెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ భానుమతి ప్రకటన రూపంలో తెలియజేశారు

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS