అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ నవంబర్ 5 వలిగొండ*యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ గురువారం మోటకొండూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలు మరియు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల (Verticals) పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్షించారు.అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కుంటూ నేరాల నియంత్రణకు సమర్థవంతంగా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలొ మోటకొండూర్ ఎస్ఎచ్ఓ బి. కుమారస్వామి, ఏఎస్ఐ ప్రకాష్ ఇతర పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.