వేములవాడ పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం
-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేస్తాం: పట్టణ అధ్యక్షులు తుమ్ మధు
-కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం… పార్టీని మరింత బలోపేతం చేస్తాం
–నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన తుమ్ మధు
( అక్షర ఆయుధం న్యూస్ )ఆగస్టు 30 రిపోర్టర్ శివలింగం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీని పట్టణ అధ్యక్షుడు తుమ్ మధు ఆదివారం నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృత తీసుకెళ్లాలని వారు అన్నారు నూతన కమిటీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామని తెలిపారు.