అరకు గడ్డపై పసుపు జెండా ఎగరాలి – ప్రజల గుండెల్లో టి డి పి నిలవాలి.
అరకు గడ్డపై స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు .
అక్షర ఆయుధం న్యూస్ 30 ఆగస్టు 2026 : (రిపోర్టార్ జి రాంబాబు) అల్లూరి జిల్లా. వార్త విశ్లేషణ : అరకు నియోజకవర్గం.
అరకులోయ, ఆగస్టు 29న గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. అనంతరం జరిగిన టీడీపీ కేడర్ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా, వర్గ భేదాలకు తావులేకుండా పనిచేయాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో క్రియాశీలక నాయకులు కిడారి శ్రావణ్ కుమార్ (జీసీసీ ఛైర్మన్), సియ్యారి దొన్నుదొర (రీజినల్ ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్)*తో పాటు మండల స్థాయి అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, సీనియర్ నాయకులు, మహిళలు, యువత మరియు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొని కేడర్ సమావేశాన్ని విజయవంతం చేశారు.ఐక్యతే మన బలం… కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక!చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మరింత బలోపేతం!అరకు గడ్డపై పసుపు జెండా ఎగరాలి – ప్రజల గుండెల్లో టీడీపీ నిలవాలి.కేడర్ సమావేశం లో టి డి పి ముఖ్య నాయకులు, టి డి పి పార్టీ శ్రేణులు, జనసేన కార్యకర్తలు, పెద్దఎత్తున్న పాల్గొన్నారు.