వలిగొండలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల ఉత్సవాలు

August 31, 2026 | సినిమా వార్తలు

వలిగొండ ఆగస్టు 31 అక్షర ఆయుధం ప్రతినిధి వలిగొండ మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవి బోనాల ఉత్సవాలను గౌడ కులస్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో శివసత్తుల పూనకాలు, ఆడపడుచుల యువకుల నాట్యాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో తయారుచేసిన నైవేద్యం కుండలను పసుపు కుంకుమలతో అలంకరించుకొని తలపై బోనాలు ఎత్తుకుని ఆలయానికి చేరుకొని కంఠమహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సంఘం సభ్యులు, గౌడ పెద్దలు ప్రజాప్రతినిధులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper