తిరుపతిలో వివాహ వేడుకకు హాజరైన నల్లారి సోదరులు
అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ( *అక్షర ఆయుధం న్యూస్ రిపోర్టర్ జయకుమార్ )తిరుపతిలో వివాహ వేడుకకు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరు మరియు నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డి తిరుపతి శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం 30-08-2026న నిర్వహించిన వివాహ వేడుకకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు సురేష్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు ఈ వివాహ వేడుకకు పీలేరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డి గారు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు వివాహ వేడుకలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు నల్లారి కిషోర్ రెడ్డి పాల్గొనడంతో కుటుంబ సభ్యులు బంధువులు మరియు ఆత్మీయుల్లో ఆనందం నెలకొంది ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఇరువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు మరియు పలువురు ఆత్మీయులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు