ప్రమాదం అంచున అర్థం బ్రిడ్జి.. ఎన్నిసార్లు వార్తలు వేసినా స్పందించని ఆర్‌అండ్‌బీ శాఖ!

August 30, 2026 | తెలంగాణ

అక్షర ఆయుధం న్యూస్ రిపోర్టర్ కాలిశెట్టి శంకర్రావు ఆగస్టు 30 పార్వతీపురం మన్యం జిల్లాకొమరాడ మండలం, అర్థం:
కొమరాడ మండలంలోని అర్థం గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారుతున్నప్పటికీ సంబంధిత ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిడ్జి పరిస్థితిపై ఇప్పటికే అక్షర ఆయుధం న్యూస్‌లో పలుమార్లు కథనాలు ప్రచురించినప్పటికీ, ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బ్రిడ్జి దెబ్బతిన్న పరిస్థితిలో ఉండటంతో నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.వార్తలు ప్రచురించినా.. అధికారుల నుంచి స్పందన శూన్యం!ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చినా సంబంధిత శాఖ నుంచి కనీస స్పందన లేకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా, ముందుగానే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులు అర్థం గ్రామ బ్రిడ్జిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper