ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నాగేల్లి రాములుకు ఘన నివాళి*
వలిగొండ ఆగస్టు 28 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ మలిదశ ఉద్యమకారుడు నాగేల్లి రాములు అనారోగ్యంతో గురువారం మరణించగా ఉద్యమకారుల ఫోరం నాయకులు శుక్రవారం ఆయన పార్తివదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో రాములు చేసిన పోరాట స్ఫూర్తి మరువలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి, బొడిగె సుదర్శన్ గౌడ్, మారగోని బిక్షపతి తదితరులు ఉన్నారు.