వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే కుంభం

August 27, 2026 | సినిమా వార్తలు

వలిగొండ ఆగస్టు 27 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంబంఅనిల్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా వలిగొండకు చెందిన బత్తిని సహదేవ్ గౌడ్ ఉపాధ్యక్షులుగా శనిగారపు పాండు గంధ మల్ల నరసింహ ప్రధాన కార్యదర్శిగా మామిడి సత్తిరెడ్డి దండెం సరిత గంగాపురం సాయిబాబా, సూదిని రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా కార్యదర్శులుగా బుగ్గ వెంకటేశం, గంగాపురం సంధ్యారాణి, కసర బోయిన నరసింహ,బండారి అనిత కళ్లెం బాల శంకర్ గౌడ్ రేకల బాలరాజ్ గౌడ్ ప్రకటించగా ఎక్స్ క్యూట్ మెంబర్లుగా ఏర్పుల యాదయ్య ఎమ్మే నవ్య ఎడవెల్లి మల్లేశం జక్కల శోభ రాణి దండ మల్లికార్జున్ మాదాసు రాణి కేసరి మహేందర్ రెడ్డి కందుల నరేష్ కళ్లెం రాములు ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని సూచించారు ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అన్నారు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని పేదలకు అందుతున్న ప్రతి పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం సాగునీటి కాలువల విషయంలో నిర్లక్ష్యం చేసిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటి కాలువలకు ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలను నిధులు మంజూరు చేసి సాగునీరు అందించే ప్రక్రియను చేపట్టిందని అన్నారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ నియామక పత్రాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సహదేవుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజు వలిగొండ సింగిల్ విండో చైర్మన్ గరిసె రవివలిగొండ ముద్దాపురం గ్రామాల సర్పంచులు కుంభం వెంకట్ పాపిరెడ్డి సామ రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిని లింగయ్య గంగాపురం సతీష్ రైతు సంఘం నాయకులు నరేందర్ రెడ్డిగౌడుగూడూరు శ్రీధర్ రెడ్డి కాసుల గుండు దానయ్య గౌడువెంకన్న గౌడ్ మత్స్యగిరి గుట్ట డైరెక్టర్ రాధారపు రమేష్ ఎమ్మే లింగస్వామి ఉలిపే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper