మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర నాయకులు : వాకిటి అనంతరెడ్డి

August 27, 2026 | సినిమా వార్తలు

వలిగొండ ఆగస్టు 27 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామానికి చెందిన సాంబయ్య చారి, ఆరూరు గ్రామానికి చెందిన రవ్వ సత్యం అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాకిటి అనంతరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఇరు కుటుంబాలకు 5,000/- రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వేములకొండ గ్రామ సర్పంచ్ ఏర్పుల వెంకటేశం, మాజీ ఎంపీటీసీ సామ రాంరెడ్డి, వేములకొండ ఉపసర్పంచ్ అంబటి సాయికుమార్, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త అనంత చారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper