మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి*సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి

August 25, 2026 | సినిమా వార్తలు

వలిగొండ ఆగస్టు 25 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. రవి అన్నారు. మంగళవారం మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ.శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐపి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఐ హిందూ, ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు మరియు శాంతి కమిటీ సభ్యులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు.పండుగ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడకుండా, పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. అలాగే ప్రజలందరూ మతసామరస్యాన్ని పాటిస్తూ పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.అనంతరం హాజరైన హిందూ ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper