చిన్నారుల చేతుల్లో హరిత హారం.. పచ్చదనానికి బాటలు
**లిటిల్ మైండ్స్ హైస్కూల్లో ఘనంగా హరితహారం కార్యక్రమం*
*మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన* *
(అక్షర-ఆయుధం రిపోర్టర్):-వెంకటేష్* డోర్నకల్ సెప్టెంబర్ 3:పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా లిటిల్ మైండ్స్ హైస్కూల్లో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గోగుల మహేశ్వరి, ప్రిన్సిపాల్ గోగుల మాల్సూర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఇన్చార్జి ఆర్. భవాని శాంతి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వరూప, ఉమ, శ్రీలత, షైనాజ్, కావ్య, సుభద్ర తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.🌱 “మొక్క నాటడం ఒక కార్యక్రమం కాదు.. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే బహుమతి” అనే సందేశంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.