గాయత్రి స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వలిగొండ సెప్టెంబర్ 3 అక్షర ఆయుధం ప్రతినిధి వలిగొండ పట్టణంలోని గాయత్రి హైస్కూల్ నందు గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి రోహిణి నక్షత్ర యుక్త రోజున శ్రీకృష్ణుడు కంసుడి చెరసాలలో దేవకి, వసుదేవులకు జన్మించాడు.దీనిని గోకులాష్టమి, అని శ్రీకృష్ణుని బాల్య లీలలను స్మరిస్తూ ఉట్టి కొట్టే వేడుకను ఘనంగా నిర్వహిస్తారుఅని అన్నారు .ఈ కార్యక్రమంలో చైర్మన్ తావుటాము నరహరి, మురళీధర్ రెడ్డి, కొంతం బిక్షపతి, పాలకుర్ల వెంకటేశం గౌడ్, బిమిడి కవిత, తదితరులు పాల్గొన్నారు.