ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో జిరాయత్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 69వ స్వచ్ఛభారత్ కార్యక్రమం*..!!

August 30, 2026 | తెలంగాణ

అక్షర ఆయుధం ~ఆర్మూర్ మండల్ ~తేది :~30•8•2026″తెలంగాణ రాష్ట్ర”నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ మున్సిపల్ పట్టణంలోని జిరాయత్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 69వ స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తచెదారాన్ని తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 69వ వారానికి చేరుకుందన్నారు. ఇందులో భాగంగా పూర్వ విద్యార్థి పాల్గొని తమ పాఠశాలలో ఉన్న పిచ్చి మొక్కలను చిత్తచెదాన్ని తొలగించమన్నారు.ఇదే విధంగా ప్రతి వారం ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు అసిస్టెంట్ ఇంజనీరింగ్ గణేష్, డ్రైవింగ్ వేణు, నూకల ఆదిత్య, రిపోర్టర్ రమేష్, మహేష్ అగర్వాల్, సాయి కిరణ్,డోలి జీవన్ కుమార్,పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, అటెండర్ కోటగిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.ఇట్లు:~ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ *వార్త సేకరణ :~ అక్షర ఆయుధం న్యూస్ రిపోర్టర్ ఆర్మూర్ మండల్ మర్యాల వేంకటేశం గుప్తా మొబైల్ నెంబర్ 9885897440

🌐 Select Language:
📰 ePaper