జగ్గంపేటలో శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల నూతన క్యాంపస్ ప్రారంభించిన జిల్లా టిడిపి అధ్యక్షులు కాకినాడ జిల్లా జ్యోతుల నవీన్

విద్యార్థుల విద్యతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి… జ్యోతుల నవీన్
జగ్గంపేట, జూన్ 30: అక్షర ఆయుధం ప్రతినిధి జగ్గంపేట శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల నూతన క్యాంపస్‌ను టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. చైర్మన్ బండారు నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జ్యోతుల నవీన్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చుకుంటేనే ఉన్నత శిఖరాలు అందుతాయి. చదువు ఒక్కటే కాదు, సంస్కారం కూడా ముఖ్యం అని అన్నారు. పాఠాలతో పాటు ఆటలపై విద్యార్థులకు ఆసక్తి కలిగించాలి. చిన్నప్పటి నుంచే సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు.శ్రీ ప్రజ్ఞ స్కూల్ జగ్గంపేటలో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోంది. నూతన క్యాంపస్‌తో మరిన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయి. విద్యతో పాటు క్రీడలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం మా సంస్థ ప్రత్యేకత అని స్కూల్ చైర్మన్ బండారు నాగబాబు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు, కందులు గోవిందు చౌదరి, శ్రీ ప్రజ్ఞ స్కూల్ డైరెక్టర్ తుమ్మల శ్వేత, కొల్లుమళ్ళ వీరబాబు, బండారు నాని, చెలికాని హరి, ప్రిన్సిపాల్ అభి, ఇంచార్జ్ కొల్లా శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.