రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు, మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు
*శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి వేడుకలు* *నివాళులర్పించిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు* కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 4 :స్థానిక గోకవరం రోడ్డులోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో *జగ్గంపేట క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో* నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు *ఎస్వీఎస్ అప్పలరాజు* ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అప్పలరాజు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ _”అల్లూరి సీతారామరాజు అంటే తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక. కేవలం 27 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రలేకుండా చేసిన ధీశాలి. తుపాకీకి విల్లంబులతో సమాధానం చెప్పిన యోధుడు. అడవి బిడ్డల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తి. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకం. మన్యం ప్రజల విముక్తి కోసం సాగించిన రంప ఉద్యమం భారత స్వాతంత్ర్య చరిత్రలో సువర్ణ అధ్యాయం.”_ అలాగే ఆర్థికంగా వెనుకబడిన క్షత్రియ కుటుంబాలను ఆదుకునేందుకు *జగ్గంపేట క్షత్రియ పరిషత్ ఎల్లప్పుడూ ముందుంటుందని* ఎస్వీఎస్ అప్పలరాజు గారు స్పష్టం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల రాజు మురళి రాజు, పాకలపాటి రవి వర్మ, చిట్టిబాబు మాస్టారు రాజు, సత్తిబాబు రాజు, దంతులూరి కృష్ణంరాజు, మంతెన శంకుబాబు రాజు, దాట్ల కృష్ణంరాజు, గొట్టిముక్కల రఘురామరాజు, మంతెన శ్రీహర్ష రాజుజగ్గంపేట క్షత్రియ పరిషత్ సభ్యులు, పలువురు ప్రముఖులు, స్థానిక పెద్దలు పాల్గొని అల్లూరికి నివాళులర్పించారు.
