రిటైర్డ్ ఎంఈఓ కట్ట శ్రీనివాస్ కు సన్మానం
రుద్రూర్, జూన్ 4 (అక్షర ఆయుధం న్యూస్) : రుద్రూర్ మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఎంఈఓ కట్ట శ్రీనివాస్ కు గురువారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాల బృందం తదితరులు పాల్గొన్నారు.