కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఘనంగా సన్మానించిన ఉద్యమకారుల పోరం నాయకులు

June 13, 2026 | తెలంగాణ

వలిగొండ జూన్ 13 అక్షర ఆయుధం : వలిగొండ మండల కాంగ్రెస్ పార్టి నూతన అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన బత్తిని సహదేవ్ గౌడ్ ను ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమానికి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కమిటీని వేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఉద్యమకారుల ఫోరం నాయకుడు బత్తిని సహదేవ గౌడ్ ను అధ్యక్షునిగా నియమించడం పట్ల ఆయన వర్షం వ్యక్తం చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు సహదేవ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీని మాట తప్పకుండా నెరవేరుస్తుందని, తనను సన్మానించిన ఉద్యమకారుల ఫోరం నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజయ్య, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, ఫోరం గౌరవ అధ్యక్షుడుకళ్లెం లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంధ మల్ల బాలయ్య, ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు గంధ మల్ల మల్లమ్మ, చిలుగూరిసత్తిరెడ్డి, బత్తిని రవీందర్, మల్లం వెంకటేశం,బొడిగేసుదర్శన్, కదిరేని స్వామి,కొండూరు సత్తయ్య,దండ మల్లికార్జున్, సుంకి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper