అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా, కిర్లంపూడి, జూన్ 20: అక్షర ఆయుధం ప్రతినిధి కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కేంద్రంలోని మౌలిక వసతులు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. పాల ప్యాకెట్లు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలు, వాటి ఎక్స్పైరీ తేదీలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం అంగన్వాడీలోని చిన్నారులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. “అన్నం రుచిగా ఉందా? రోజూ ఏం నేర్చుకుంటున్నారు?” అంటూ ఆప్యాయంగా పలకరించారు. పిల్లలకు అందుతున్న విద్య, పోషణపై అంగన్వాడీ టీచర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, “బాలల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే పునాది. ఇక్కడ పిల్లలకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యతో పాటు ప్రేమ, ఆప్యాయత కూడా అందాలి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దు. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలి. అదే మన లక్ష్యం” అని సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరేలా పారదర్శకంగా పనిచేయాలని, కేంద్ర నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జంపన సీతారామచంద్ర వర్మ, జంపన రవి వర్మ, గంగిరెడ్ల దొరబాబు, మంచి కంటి శ్రీను, జ్యోతుల చిన్ని, సూతి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.