ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొన్న మైసొల్ల ప్రవీణ్ కుమార్
వలిగొండ:జులై 03 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : వలిగొండ పట్టణ కేంద్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా “మన ఓటు- మన బాధ్యత” నినాదంతో శుక్రవారం వలిగొండ పట్టణంలో 251 పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటా ఎన్యుమరేషన్ ఫారాలు నింపటం జరిగింది. ఈ కార్యక్రమంలో 251 బూత్ లెవల్ ఏజెంట్ వలిగొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మైసోళ్ళ ప్రవీణ్ కుమార్, బూత్ లెవెల్ ఆఫీసర్ పంజాల పద్మ తదితరులు పాల్గొన్నారు.