గండేపల్లిలో స్పౌస్ పెన్షన్లు పంపిణీ చేసిన – గ్రామ టిడిపి అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ

కాకినాడ జిల్లా, గండేపల్లి, జూలై 2: గండేపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన పెన్షన్ దారుల స్పౌస్ పెన్షన్లను వారి భార్యలకు అందజేశారు. నాళం సింహాద్రి పెన్షన్ ను భార్య నాళం అర్జునుకు, కందుకూరి సత్యనారాయణ పెన్షన్ ను భార్య కందుకూరి మరియమ్మకు గ్రామ టీడీపీ అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచడం ముందుంటున్నారని భర్త మరణించిన వెంటనే స్పౌస్ పెన్షన్లు మంజూరు చేయించి ఆ కుటుంబానికి అండగా నిలబడుతున్నారని తెలిపారు. రెండేళ్ల సుపరిపాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ప్రజలకు అందిస్తూ వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పైల వెంకన్న, కందుకూరు సుబ్బారావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మి, డిజిటల్ ఆపరేటర్ గంగాభవాని పాల్గొన్నారు.