సింగరం పాలెంలో వీబీ-గ్రామ్ జీ ప్రారంభించిన రాష్ట్ర డైరెక్టర్ కోతుల మోహనరావు

కాకినాడ జిల్లా గండేపల్లి జూలై 2 : అక్షర ఆయుధం ప్రతినిధిగండేపల్లి మండలం సింగరం పాలెం గ్రామంలో వికసిత్ భారత్ – గ్రామీణ్ రోజ్గార్ & ఆజీవికా మిషన్ ను ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు మాట్లాడారు.భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని తీసుకొచ్చాయి. ఈ రోజు సింగరం పాలెంలో ప్రారంభించాం. అదే సమయంలో జగ్గంపేట మండలం రాజపూడిలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. అని అన్నారు.జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. ప్రతి గ్రామంలో ఉపాధి కూలీలు, రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఉపాధి సిబ్బంది, అధికారులు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.వీబీ-గ్రామ్ జీ దేనికోసం, ఎలా అమలు చేస్తామో ప్రజలకు పూర్తిగా చెప్తాం. ప్రతి గ్రామంలో ఏ పనులు అవసరమో గుర్తించి ఆ వివరాలు ప్రజల ముందు పెడతాం. గుర్తించిన పనుల్లో ఒక పనిని ప్రతీకాత్మకంగా ప్రారంభిస్తాం.జూన్ 30తో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఆన్లైన్ ప్రక్రియ ఆగిపోయింది. జూలై 1 నుంచి వీబీ-గ్రామ్ జీ కిందనే పనులు చేస్తాం.ఈ పథకంతో ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పని ఇస్తాం. పంటల సీజన్ వచ్చినప్పుడు రైతుకు అవసరం అయితే ఉపాధి పనులు ఆపి వ్యవసాయ పనులకు ప్రాధాన్యత ఇస్తాం.నీటిని కాపాడుకోవడం, ప్రకృతి వనరులు పెంచడం, ఊర్లో సౌకర్యాలు కల్పించడం, ఉపాధి మార్గాలు పెంచడం, వరదలు, కరువు లాంటి వాటిని తట్టు కునేందుకు మొత్తం 318 రకాల పనులు చేసుకోవచ్చు. కేవలం కూలీ పని కాదు, గ్రామంలో జీవనోపాధి పెరగడమే మన లక్ష్యం.ప్రజలంతా కలిసి వస్తేనే గ్రామం బాగుపడుతుంది. గ్రామం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. అందరం కలిసి పని చేద్దాం.కార్యక్రమంలోఎండీఓ హరికృష్ణ ఏపీఓ, కృష్ణంరాజు, ఈసీ రమేష్, ఉమా, ఎ. నాగేశ్వరరావు, ఎ. సుదర్శనరావు,బి. చంద్రరావు, ఎ. దీపు, బి. చౌదరి, ఎ. రాజా అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు అధికారులు పాల్గొన్నారు.