సోమవరంలో సంఘం డైరీ నూతన మిల్క్ కూలింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం

ప్రారంభోత్సవంలో పాల్గొన్న పాడి రైతులు పాఠంశెట్టి గణేష్, పాఠం శెట్టి తమ్మారావు దంపతులు
కాకినాడ జిల్లా కిర్లంపూడి జులై 1 : కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రముఖ పాల వ్యాపార సంస్థ సంఘం డైరీ నూతన మిల్క్ కూలింగ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సోమవారం ప్రారంభించింది. రైతులకు మరింత చేరువగా సేవలందించే లక్ష్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జ్యోతుల నవీన్ సన్నిహితుడు, పాడి రైతులు పాఠంశెట్టి గణేష్, పాఠంశెట్టి తమ్మా రావు దంపతులు ఉత్తమ రైతుగా హాజరయ్యారు. గణేష్ మాట్లాడుతూ, “పాలు ప్రతి ఇంటి ఆరోగ్యానికి పునాది. రైతు కష్టానికి గిట్టుబాటు ధర, వినియోగదారుడికి స్వచ్ఛమైన పాలు అందించడమే సంఘం డైరీ లక్ష్యం. ఈ కూలింగ్ యూనిట్ వల్ల సోమవారం, చుట్టుపక్కల గ్రామాల్లోని వందలాది పాడి రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. సమయానికి సేకరణ, నాణ్యతలో రాజీ లేని ప్రాసెసింగ్‌తో రైతు భరోసా పెరుగుతుంది” అన్నారు.మొట్టమొదటి పాల పంపిణీదారులుగా పాఠం శెట్టి తమ్మారావు దంపతులు యూనిట్లో పాలు పోసి ప్రాసెసింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. “పాడి రైతు చెమట చుక్క విలువ తెలిసిన సంస్థ సంఘం డైరీ. ఈ యూనిట్ మా లాంటి చిన్న రైతులకు పెద్ద ఊరట” అని తమ్మారావు దంపతులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సాగర్, డీఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సాగర్ మాట్లాడుతూ, “పాలు కేవలం ఆహారం కాదు, సంపూర్ణ పోషణ. గేదె పాలు, ఆవు పాలు ప్రతి బిడ్డ ఎదుగుదలకు, పెద్దల ఆరోగ్యానికి అవసరం. రోజుకు 10వేల లీటర్ల కూలింగ్ సామర్థ్యంతో ఏర్పాటైన ఈ యూనిట్ ద్వారా పాల నాణ్యత, తాజాదనం 100% కాపాడతాం. రైతు నుంచి సేకరించిన 4 గంటల్లోపే చిల్లింగ్ పూర్తి చేసి కల్తీకి ఆస్కారం లేకుండా చేస్తాం” అని వివరించారు.డీఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “సంఘం డైరీ అంటే నమ్మకం. రైతు గేదె కడితే లాభం గ్యారెంటీ అనే భరోసా మేం ఇస్తాం. ఈ యూనిట్‌తో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు చెల్లింపులు జరుగుతాయి. పాడి అభివృద్ధే గ్రామీణ అభివృద్ధి” అన్నారు.యూనిట్ ప్రత్యేకతలు:అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీతో పాలలోని పోషకాలు యథాతథం రోజుకు 10,000 లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం పారదర్శకంగా కొవ్వు శాతం పరీక్ష, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా రైతుకు సమాచారం సోమవారం, కిర్లంపూడి మండలంలోని 15 గ్రామాల రైతులకు ప్రయోజనంసంఘం డైరీ యాజమాన్యం ఈ యూనిట్ ద్వారా పాడి రైతుల ఆదాయం పెంచడం, వినియోగదారులకు కల్తీలేని స్వచ్ఛమైన పాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపింది.